
ఇచ్చిన హామీ మేరకు డీఎస్ కు ఓ పదవి వచ్చింది.. ముందుగా అనుకున్న ప్రకారం ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఇస్తానని డీఎస్ కు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పట్లో ఆ ఎన్నికలు లేకపోవడంతో ఆయన అసంతృప్తి గురికాకుండా సలహాదారుగా ఓ పదవిని ఇచ్చారు కేసీఆర్..
సీఎం కేసీఆర్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా డీఎస్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు నెలకు లక్ష రూపాయల వేతనం.. ఇతర అలవెన్సుల కింద రూ.50 వేలు, కారు సదుపాయం కల్పిస్తూ ఆదేశించారు.
దీంతో డీఎస్ కు గౌరవం లభించినట్టైంది.. కేసీఆర్ హామీ నెరవేరినట్టైంది..