
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. శాసనసభలో సభాపపతి మధుసూదనాచారి, శాసనమండలిలో చైర్మన్ స్వామిగౌడ్ లో ఆధ్వర్యంలో సభా సమావేశాలు జరుగుతున్నాయి.. జాతీయ గీతాలాపన అనంతరం స్పీకర్ సమావేశాన్ని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సంతాపం తీర్మానంతో ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ మొదటగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. హైదరాబాద్లోని డీఆర్డీవోకు కలాం పేరు పెడుతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రతిపక్షాల నుంచి జానారెడ్డి, ఎర్రబెల్లి, లక్ష్మన్, ఎంఐఎం సీపీఐ నేతలు కలాంపై మాట్లాడారు.
శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమై కలాం సంతాప తీర్మానంతో మొదలయ్యాయి.. ఆ తర్వాత రెండు సభలు ఈనెల 29కి వాయిదా పడ్డాయి.. బక్రీద్, వినాయక చవితి తదితర పండుగలు ఉండడంతో సభలు వాయిదా పడ్డాయి..