Breaking News

డిసెంబర్ 15 నుండి 19 వరకు హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం

డిసెంబర్ 15 నుండి 19 వరకు హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం

డిసెంబర్ 15 నుండి 19 వరకు హైదరాబాద్ లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ పి సింగ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.శనివారం సచివాలయంలో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై సి.ఎస్ ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు డా.కె.వి రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ డా.నందిని సిద్దా రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ ఆయాచితం శ్రీధర్,ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, డి.జి.పి.శ్రీ మహెందర్ రెడ్డి, హైదరాబాద్ కమీషనర్ శ్రీ శ్రీనివాస్ రావు, పౌర సరఫరాల శాఖ కమీషనర్ శ్రీ సి.వి.ఆనంద్, కార్యదర్శులు శ్రీ నవీన్ మిట్టల్, శ్రీ బి.వెంకటేశం, హెచ్.యం.డి.ఎ కమీషనర్ శ్రీ చిరంజీవులు, టి.ఎస్.టి.డి.సి. యం.డి. క్రిష్టినా జడ్
చొంగ్తు, సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేడుక జరిగే ఎల్.బి.స్టేడియంలో ప్రధాన వేదిక, వివిధ ప్రతినిధులకు సీటింగ్ తదితర ఏర్పాట్లకి సంబంధించి లే అవుట్ పై సమీక్షించారు. భోజన వసతిపై సమీక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎల్.బి.స్టేడియం తెలుగులో సూచికలతో వివిధ బోర్డులు ఏర్పాటు చేయాలని సి.ఎస్. సూచించారు. మెస్సర్స్ విజ్ క్రాప్ట్ ద్వారా లేజర్ షో ఏర్పాట్ల పై ప్రత్యేకంగా సమీక్షించారు. పోలీసు శాఖ ద్వారా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ఆర్.టి.సి ద్వారా ప్రత్యేక బస్సుల ఏర్పాట్ల పై చర్చించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చే ప్రతినిధులకు ఈ మేల్, ఎస్ఎం.ఎస్ ద్వారా తగు సమాచారాన్ని అందించాలన్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో టీం వర్కు గా పనిచేసి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *