డిసెంబర్ 15 నుండి 19 వరకు హైదరాబాద్ లో తెలుగు మహాసభలు ప్రారంభం

డిసెంబర్ 15 నుండి 19 వరకు హైదరాబాద్ లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే నిమిత్తం జిల్లాల నుండి సాహిత్యం పై మక్కువ ఉన్న అభిమానులకు ఆర్ టి సి బస్సుల ద్వారా రవాణా సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ పి సింగ్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ అధికారి శ్రీ బి ఆర్ మీనా, జి.ఎ.డి ముఖ్యకార్యదర్శి శ్రీ అధర్ సిన్హా, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బి.వెంకటేశం, మైనారిటీ శాఖ కార్యదర్శి శ్రీ ఓమర్ జలీల్, అడిషనల్ డిజి శ్రీ అంజనీకుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్రీమతి యోగితా రాణా, రంగారెడ్డి కలెక్టర్ శ్రీ రఘునందన్ రావు, మేడ్చల్ కలెక్టర్ శ్రీ ఎం.వి.రెడ్డి, టి.ఎస్.టి.డి.సి. యం.డి. క్రిష్టినా జడ్ చొంగ్తు, పాఠశాల విద్యాకమీషనర్ శ్రీ కిషన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్న మహోన్నత లక్ష్యంతో ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంకంగా నిర్వహిస్తున్నదని, గతంలో ఎన్నడూ జరగని రీతిలో మహా సభలను నిర్వహించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి సంకల్పమని సి.ఎస్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం గర్వకారణమని తెలుపుతూ ఈ నెల 15వ తేదిన గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ యం.వెంకయ్యనాయుడు సాయంత్రం 6 గంటలకు తెలుగు మహాసభలను ప్రారంభిస్తారని, తెలంగాణ గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యాసాగర్ రావు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు పాల్గొంటారని, 19 వతేదిన ముగింపు వేడుకలలో ముఖ్యఅతిధిగా గౌరవ రాష్ట్రపతి శ్రీ రామ్ నాధ్ కోవింద్ పాల్గొంటారని ఆయన తెలిపారు.

ప్రారంభ, ముగింపు వేడుకలలో జిల్లాలనుండి పాల్గొనదల్చుకున్న సాహిత్యప్రియులకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. హైదరాబాద్ నుండే కాకుండా జిల్లాల నుండి కూడా ఈ సాహిత్యపండుగలో పాల్గొనాలన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాలమేరకు సిద్దిపేట, వరంగల్ (అర్భన్, గ్రామీణ),
కరీంనగర్ ల నుండి 30 బస్సులు, సంగారెడ్డి, మెదక్,యాదాద్రి, జనగాం, నల్లగొండ,మహబూబ్ నగర్, నిజామాబాద్, జిల్లాల నుండి 20 బస్సుల చొప్పున, కామారెడ్డి 15, వికారాబాద్ 10, ఖమ్మం నుండి 10 బస్సులు, మిగతా జిల్లాల నుండి 5 బస్సుల చొప్పున ఏర్పాటు
చేయాలన్నారు. స్ధానిక పోలీసు యంత్రాంగం, హైదరాబాద్,సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్ల సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జిల్లాల నుండి ప్రత్యేకంగా నోడల్ ఆఫిసర్లను నియమించుకోవాలన్నారు.

దాదాపు 500 నుండి 550 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖాధికారి, రవాణా, పోలీసు అధికారులతో ప్రత్యేకంగా
సమావేశం నిర్వహించుకోవాలన్నారు. జిల్లాలోని జెడ్ పి ఛైర్మన్, డిసిసిబి ఛైర్మన్, మార్కెట్ కమిటీ, జిల్లా గ్రంథాలయ సంస్ధ ఛైర్మన్లకు ఆహ్వాన లేఖలను పంపాలన్నారు. సాహిత్యశాఖ ముద్రించిన బ్రోచర్ ను జిల్లాలలో ప్రచారం గావించాలన్నారు. క్రిస్టమస్ పండుగలను పురస్కరించుకొని గిఫ్టు ప్యాకులను ఇప్పటికే జిల్లాలకు పంపించామని, స్ధానిక శాసన సభ్యులను సంప్రదించి చర్చీలలో ఈ నెల 14 న దుస్తుల పంపిణీ
18 న క్రిస్టమస్ విందును నిర్వహించాలని మైనారిటీ శాఖ కార్యదర్శి శ్రీ ఓమర్ జలీల్ జిల్లా కలెక్టర్లను కోరారు. నోడల్ అధికారులను నియమించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. నిర్వహణ కమిటీల ద్వారా లబ్ధిదారులను గుర్తించాలన్నారు.

రెవెన్యూ రికార్డుల అప్ డేషన్ కు సంబంధిత రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బి ఆర్ మీనా మాట్లాడుతూ ప్రతి గ్రామానికి సంబంధించి 1బి రిజిష్ట్రర్, పహనీలను, ఫిజికల్ కాపీలను సిద్ధం చేయాలన్నారు. గ్రామాల వారిగా డాటాబేస్ ను సిద్ధంచేయాలని, వ్యవసాయ, వ్యవసాయేతర, ప్రభుత్వ, భూముల వివరాలను తయారుచేయాలని, గ్రామ మొత్తం విస్తీర్ణం నమోదు కావాలన్నారు.

SP SINGH..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *