
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. పాఠశాలల దుస్తితిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో వేసిన కమిటీ నివేదిక సుప్రీం కోర్టు కు చేరింది. విద్యావవ్యస్థ దిగజారడానికి ఉపధ్యాయుల కొరత కారణమని తెలిపింది. దీనిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ ఉద్యోగుల విభజన జరుగనుందని డీఎస్సీ వాయిదా వేశామని సుప్రీం కు తెలపగా.. ఆయన వాదనపై మండిపడ్డ సుప్రీం ధర్మాసనం.. కొత్త రాష్ట్రం ఉద్యోగుల విభజన జరగలేదంటూ ఎన్నాళ్లు ఇలా తప్పించుకుంటారని.. మీ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు నష్టపోతారని మండిపడింది..
డిసెంబర్లోగా పాఠశాలల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని.. వెంటనే డీఎస్సీ వేయాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఖాళీలు, ఉద్యోగాల భర్తీకోసం తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను పంపింది..