డిసెంబర్ లో ఎస్.ఆర్.ఎస్.పి.నీటి విడుదల

IMG-20171116-WA0090

ఎస్.ఆర్.ఎస్.పి.నుంచి
యాసంగి లో 6.10 లక్షల ఎకరాలకు సాగునీరు.
డిసెంబర్ లో ఎస్.ఆర్.ఎస్.పి.నీటి విడుదల.

నీటి లభ్యత తక్కువ ఉన్నందున ఆరుతడి పంటలను ప్రోత్సహించాలి.

రైతులకు అవగాహన కల్పించాలి.

రెండు,మూడు రోజుల్లో ఎస్.ఆర్.ఎస్.పి పై నాలుగు జిల్లాల కలెక్టర్ లు, ఎస్.పి లతో వీడియో కాన్ఫరెన్స్.

టెయిల్ టూ హెడ్ విధానం లో సాగునీటి సరఫరా.

నిజామాబాద్ లో గత యేడాది సక్సెస్ అయిన టెయిల్ టు హెడ్ ప్రయోగం.

చిట్టచివరి ఆయకట్టుకు కూడా నీరందాలి.

కాలువలపై నిరంతర నిఘా, తనిఖీలు.

ఎస్.ఆర్.ఎస్.పి.పరిధిలో ఈ యాసంగి సీజన్ లో 6 లక్షల 10 వేల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయాలని గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం లో నిర్ణయించారు.
డిసెంబర్ లో  ఎస్.ఆర్.ఎస్.పి.నుంచి సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో రెండు,మూడు రోజుల్లో నాలుగు జిల్లాల కలెక్టర్ లు,ఎస్.పి.లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని మంత్రులు హరీశ్ రావు,ఈటల నిర్ణయించారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి ఆయకట్టు కు నీరందించే విషయంపై కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో  మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ గురువారం ఇక్కడ అసెంబ్లీ కమిటీ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు.
డిసెంబర్ రెండవ వారంలో
నీళ్లు ఇవ్వాలని శాసనసభ్యులు కోరారు.యాసంగి సీజన్ లో మొత్తం 6 లక్షల 10 వేల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక ఖరారైంది.ఎస్.ఆర్.ఎస్.పి నుంచి ఎల్.ఎం.డి.ఎగువ వరకు 4 లక్షల ఎకరాలకు, ఎల్.ఎం.డి.దిగువకు 1.60 లక్షల ఎకరాలకు, సరస్వతి, లక్ష్మీ కెనాల్స్ కు 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. యాసంగి లో
8 తడులు ఇవ్వాలని  ఎం.ఎల్.ఏ.లు
విజ్ఞప్తి చేశారు.మార్చి , ఎప్రిల్లో ఎక్కువ నీళ్లు వచ్చేలా ప్రణాళిక తయారు చేయాలని  ప్రజాప్రతినిధులు కోరారు.
వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రులు ఆదేశించారు. ఎస్.ఆర్.ఎస్.పి.లో ఈ యేడాది నీటి లభ్యత తక్కువ ఉన్న నేపథ్యంలో
ఆయకట్టు చివరి రైతులు
ఆరుతడి పంటలు వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ప్రజా ప్రతినిధులను కోరారు
ఈసారి కృష్ణాలో ఎక్కువ నీళ్లు వచ్చినప్పటికీ దురదృష్టవశాత్తు గోదావరిలో నీళ్లు తక్కువ వచ్చాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.సాధారణంగా కన్నా ఈ సారి ఎస్.ఆర్.ఎస్.పి.లో
15 %నీళ్లు తక్కువ వచ్చాయని అన్నారు.ప్రస్తుతం 63 టీఎంసీ ల నీళ్లు ఎస్.ఆర్.ఎస్.పి.లో అందుబాటులో ఉన్నాయని మంత్రులు ఈటెల, హరీశ్ రావు చెప్పారు. శ్రీ రాంసాగర్
స్టేజి 1 లో  టెయిల్ ఎండ్ వరకు నీళ్లు అందించేందుకు గాను 1000 కోట్లు కేటాయించామని మంత్రులు తెలిపారు. ఈ పనులు వేగవంతం   అయ్యేలా  చూడాలని శా సనసభ్యులను కోరారు. ఆయా
పనుల పేరుతో పంటకు నీళ్లు అందించే ప్రక్రియ ను ఆపవద్దని మంత్రులు సూచించారు.ఎస్.ఆర్.ఎస్.పి.కి సంబంధించి
ప్రతి 15 రోజులకు ఒక సారి సమీక్ష చేస్తానని మంత్రి హరీశ్ రావు అన్నారు.
వి.ఆర్.ఓ,వి.ఆర్.ఏ.ల సేవలను కూడా నీటి విడుదల పనులకు వినియోగించాలని కోరారు.
లోయర్ మానేరు డ్యామ్ దిగువ ప్రాంతాల్లో
1,60,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రణాళిక రూపొందించాలని మంత్రులు ఈటల, హరీశ్ రావు కోరారు.ఎల్.ఎం.డి.దిగువ న
6 తడులలో నీళ్లు ఇస్తామని చెప్పారు.
సీఎం   కేసీఆర్, హరీశ్ రావు  త్యాగం చేసి సింగూరు ప్రాజెక్ట్ నుండి  ఎస్.ఆర్.ఎస్.పి ప్రాజెక్ట్ కి నీళ్లు ఇస్తున్నారని ఈటల అభినందించారు.ఎస్.ఆర్.ఎస్.పి లో
40టీఎంసీ లకంటే తక్కువ లభ్యత ఉంటే  గతంలో గేట్స్ తెరిచి నీళ్లు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.
ఇప్పుడు ఆ నిబంధన కూడా పక్కన బెట్టినట్టు ఈటల చెప్పారు.ఆయకట్టు చివరి రైతుకు కూడా
నీళ్లు అందించేందుకు అవసరం అయితే మూడు నెలల వ్యవధి కోసం
కొంత మంది తాత్కాలిక ఉద్యోగులను పెట్టుకుందామని ఈటల ప్రతిపాదించారు.కాగా గత యేడాది నిజామాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన టెయిల్ టు హెడ్ నీటి సరఫరా విధానం విజయవంతమైందని,అదే విధానాన్ని మిగతా ప్రాంతంలో కూడా అమలు చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. నిజామాబాద్ లో ఈ ప్రయోగం తో ఒక టి. ఎం.సి.తో 14 వేల ఎకరాల కు సాగునీరు అందించగలిగినట్టు హరీశ్ రావు గుర్తు చేశారు. ఈ సమీక్ష సమావేశం లో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎం.ఎల్.ఏ.లు జీవన్ రెడ్డి,గంగుల కమలాకర్, పుట్ట మధు, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, విద్యాసాగరరావు,మనోహరరెడ్డి,శోభ, ప్రభుత్వ స్పెషల్ సి.ఎస్.జోషి, ఇరిగేషన్ ఈ.ఎన్. సి.మురళిధరరావు,ఎస్.ఆర్.ఎస్పీ.సి.ఈ.బి. శంకర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *