డిసెంబర్ లోగా నగరంలో రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ నగరంలో జరుగుచున్న రోడ్డు విస్తరణ పనులను డిసెంబర్ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేటులో రోడ్డు విస్తరణ పనులు కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో రోడ్ల ప్రక్కనగల విద్యుత్ స్తంబాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో 96 టవర్లు ఏర్పాటు చేయాల్సి వుందని టవర్ల ఏర్పాటులో ఏమైనా సమస్యలుంటే తెలపాలని వెంటనే నగర పాలక కమీషనర్ అట్టి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. విద్యుత్తు పనులు, త్రాగునీటి పైపులైను పనులు పూర్తి అయిన తర్వాత రోడ్డు నిర్మాణ పనులు చేపడుతారని ఒకనెల లోగా విద్యుత్తు శాఖకు సంబంధించిన పనులన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణల పనులకు సంబంధించి విద్యుత్తు శాఖ, రోడ్లు భవనాల శాఖ, నగర పాలక సంస్ధ, ప్రజారోగ్య శాఖ పనులు ప్రగతిపై ప్రతి వారం ఎంతవరకు పనులు జరిగింది ప్రగతి తెలుపాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణ పనులు ప్రగతిని ఎప్పటి కప్పుడు వాట్సప్ లో పెట్టాలని ఆదేశించారు. వెంటనే రోడ్డు డివైడర్ పనులు సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అంతర్గత డ్ర్త్తైనేజ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, నగర పాలకసంస్ధ కమీషనర్ రమణాచారి, ప్రజారోగ్య శాఖ ఇ.ఇ.ఎం బద్రయ్య, హౌజింగ్ పిడి నర్సింహరావు, ట్రాన్స్ కో డి.ఇ. గౌతంరెడ్డి, ఎ.డి. అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *