డిసెంబర్‌ 4న వస్తున్న ‘మేము’

సూపర్‌స్టార్‌ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘పసంగ`2’ తెలుగులో ‘మేము’ పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. అమలాపాల్‌, బిందుమాధవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకుడు. ఇప్పటివరకు పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలు అసాధారణ విజయం సాధించి ఉండడానికి తోడు.. ‘పసంగ`2’ చిత్రాన్ని ఆ చిత్ర కథానాయకుడు సూర్య నిర్మిస్తుండడంతో.. ఈ సినిమాకు గల క్రేజ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తుండగా.. సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి సహ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాూ శరవేగంగా పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 4న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా సాయిమణికంఠ క్రియేషన్స్‌ అధినేత-చిత్ర నిర్మాత జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘తమిళ`తెలుగు భాషల్లో కలిపి వంద కోట్లకు పైగా మార్కెట్‌ కలిగిన సూర్య నటిస్తూ.. తమిళంలో నిర్మిస్తున్న ‘పసంగ-2’ చిత్రాన్ని ‘మేము’ పేరుతో తెలుగు ప్రేక్షకుకు అందించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. సూర్య చేతుల మీదుగా విడుదలైన ‘మేము’ ఆడియోకు చాలా మంచి స్పందన వస్తోంది. డిసెంబర్‌ 4న ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ‘మనం, దృశ్యం’ చిత్రాల కోవలో ‘మేము’ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది’ అన్నారు.
 ‘పిశాచి’ ఫేం అరోల్‌ కొరెల్లి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి-చంద్రబోస్‌-సాహితి, సంభాషణలు: శశాంక్‌ వెన్నెలకంటి, సహ నిర్మాతలు: ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి, సమర్పణ: సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌ !!

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *