డివిలియర్స్ సూపర్ సెంచరీ

-66బంతుల్లో 162 పరుగులు చేసిన సౌతాఫ్రికా కెప్టెన్
దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ దుమ్ము దులిపాడు. ప్రపంచకప్ లో వెస్టిండీస్ తో శుక్రవారం జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. డివిలియర్స్ పరుగుల సునామీ సృష్టించి కేవలం 66 బంతుల్లో 162 పరుగులు సాధించాడు. వన్డేల్లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.. దీంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు నమోదు చేసింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ తొందరగానే క్రిస్ గేల్ వికెట్ కోల్పోయింది. ఆ వెనుక వచ్చిన సామ్యూల్స్ కూడా ఔటవడంతో లక్ష్యం 409 పరుగులు చేయడానికి ఎదురీదుతోంది. ప్రస్తుతం 42-2తో ఎదురీదుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *