
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. ఇప్పటికే లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి.. ఫిబ్రవరి వరకు టైం ఉండడంతో ఇంకా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.. కాగా పోలీస్ కానిస్టేబుల్ దరఖాస్తులు దిమ్మతిరిగే వాస్తవాలు బయటపెట్టారు డీజీపీ అనురాగ్ శర్మ.. శనివారం ఆయన హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో విలేకరులతో మాట్లాడారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీగా రెస్పాన్స్ వస్తోందని పేర్కొన్నారు.
ఎంబీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ విద్యనబ్యసిస్తున్న ఉన్నత విద్యావంతులు సైతం కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు పంపండం తనకు విస్మయాన్ని కలిగిస్తోందన్నారు డీజీపీ అనురాగ్ శర్మ.. దీనిద్వారా కానిస్టేబుళ్లలో తెలివైన అభ్యర్థులు వస్తారని ఆశిస్తున్నామన్నారు. కానిస్టేబుళ్లుగా ఎన్నికైన ప్రతీ ఒక్కరికి మొదటిరోజే ఒక కంప్యూటర్ ట్యాబ్లెట్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్ నుంచి కేసు దర్యాప్తు ముగిసే వరకు అన్ని కంప్యూటర్లలో ఆన్ లైన్ లో నమోదు చేసేలా శిక్షణ ఇస్తామని.. దీనిద్వారా భవిష్యత్తులో పోలీసులకు ఎంతో పని తేలికవుతందన్నారు.