డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో వానాకాలం 4 టి.ఎం.సి.లు నిల్వ: మంత్రి హరీశ్ రావు

వచ్చే వానాకాలం నాటికి డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో 4 టి.ఎం.సి.ల నీటిని నిల్వ చేస్తామని ఇరిగేషన్
మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. శనివారం నాడు ఆయన నల్లగొండ జిల్లా చందంపేట మండలం నక్కలగండి
తండా దగ్గర డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పరిశీలించారు.ఎలిమినేటిమాధవరెడ్డి
ఎస్.ఎల్.బి.సి.ప్రాజెక్టులో భాగంగా డి.బి.ఆర్.ను నిర్మిస్తున్నారు. 
రిజర్వాయర్ కాలువ కట్ట పైన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. మంత్రులు నాయిని
నరసింహారెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎం.పి.గుత్తా సుఖేందర్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్,ఎం.ఎల్.ఏ.రవీంద్ర
నాయక్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తదితర నాయకులు ఉన్నారు.470 కోట్లతో చేపట్టిన
డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు 60 శాతం పూర్తయ్యాయని హరీశ్ రావు చెప్పారు. ఈ రిజర్వాయర్
పనులు వేగంగా జరుగుతున్నట్టు తెలిపారు. మిగతా పనులు కూడా 2018 వానాకాలం నాటికి పూర్తయ్యేలా
ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 7.50 టి.ఎం.సి.లని చెప్పారు.
ఇందులో 4 టి.ఎం.సి.లను వచ్చే వానాకాలం కల్లా నిల్వ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన
చెప్పారు. డి.బి.ఆర్.కు చెందిన ఒకటవ టన్నెల్ 43 కిలోమీటర్లలో 30 కిలోమీటర్ల తవ్వకాలు పూర్తయినట్టు
ఇరిగేషన్ మంత్రి చెప్పారు. మిగతా పనులు కూడా పుంజుకున్నాయన్నారు. అలాగే రెండవ టన్నెల్ తవ్వకం
పనులు 100 శాతం పూర్తయినట్టు హరీశ్ రావు తెలియజేశారు.50 శాతం లైనింగ్ పనులు పూర్తయ్యాయని
చెప్పారు. పెండ్లిపాకల రిజర్వాయర్ పనుల విషయంలో ఏజెన్సీ కి ఫైనల్ నోటీసు జారీ చేశామని, వెంటనే
పనులు ప్రారంభించకపోతే మళ్ళీ టెండర్లు పిలుస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.నాగర్ కర్నూలు జిల్లా
అచ్చంపేట నియోజకవర్గంలో భూసేకరణ కొంత పెండింగులో ఉందన్నారు. ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి
భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే
ప్రజలందరికీ తగిన నష్ట పరిహారం చెల్లిస్తామని అన్నారు. చందంపేట్ మండలం మోత్యా తండా ముంపునకు
గురయ్యే అవకాశాల గురించి నివేదిక ఇవ్వాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ఉప్పల్ ను హరీశ్ కోరారు.
ఒకవేళ ఆ తండా ముంపునకు గురయ్యేటట్లుంటే ఆర్.అండ్ ఆర్ గ్రామంగా ప్రకటించి సహాయ పునరావాస
చర్యలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు.ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు ఎస్.సునీల్, ఎస్.ఈ.లు కరుణాకర్ రెడ్డి,
హమీద్ ఖాన్ తదితరులతో డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్,పెండ్లిపాకల పనులను మంత్రి హరీశ్ రావు సమీక్షించారు.

2 3 4 5IMG-20171230-WA0133 IMG-20171230-WA0132

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *