‘డా. సలీమ్’ సెన్సార్ పూర్తి… ఈ నెల 13న విడుదల

విజయ్ ఆంటోని, అక్ష జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘డా. సలీమ్’. నాగప్రసాద్ సన్నితి సమర్పణలో ఎస్.కె. పిక్చర్స్ మరియు ఓబులేశ్వర ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. చిత్రకథానాయకుడు విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోందని సురేష్ కొండేటి అన్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయనీ, ఈ నెల 13న సినిమాని విడుదల చేస్తున్నామని కూడా తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సురేష్ కొండేటి మాట్లాడుతూ – “వైద్యం పేరుతో జనాలను దోచుకోవడం నేడు కొన్ని ఆస్పత్రులకు ఆనవాయితీ అయ్యింది. కానీ, సలీమ్ అలాంటి డాక్టర్ కాదు. రోగులకు ప్రాణాలు పోయడం మాత్రమే కాదు.. తన కళ్ల ముందు ఎలాంటి అన్యాయం జరిగినా ఎదిరిస్తాడు. బడాబాబుల చేతిలో మోసపోయిన ఓ అనాథ పిల్లను కాపాడి, వైద్యం చేసే సలీమ్ ఆ అమ్మాయి అసలు కథ తెలుసుకుంటాడు. ఆ అమ్మాయికి అన్యాయం చేసినవాళ్లను అంతం చేయడానికి సలీమ్ ఏం చేశాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. సంగీతదర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని ఈ చిత్రంలో సలీమ్ పాత్రను అద్భుతంగా చేశారు. మా ఎస్.కె. పిక్చర్స్ నుంచి ఇప్పటివరకు ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలే వచ్చాయి. ఈ చిత్రం కూడా ఆ కోవలో చేరే విధంగా ఉంటుంది. కమర్షియల్ అంశాలు మెండుగా ఉన్న మంచి కథతో దర్శకుడు నిర్మల్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించారు” అని చెప్పారు.

మరో నిర్మాత తమటం కుమార్ రెడ్డి మాట్లాడుతూ – ”ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు. అన్ని వర్గాలవారు చూడదగ్గ విధంగా చిత్రం ఉంటుంది. ఈ నెల 13న విడుదల కానున్న ఈ చిత్రం ఈ వేసవికి మంచి ఎంటర్ టైనర్ అవుతుంది” అన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *