
హైదరాబాద్, ప్రతినిధి : స్వైన్ ఫ్లూ వైరస్ పై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ విలేకరుల సమావేశంలో స్వైన్ ఫ్లూ ఎలా వస్తుంది.. నివారణ ఎలా.. ఎలా వ్యాపిస్తుంది లాంటి విషయాలను ఒక డాక్టర్ లాగా పూసగుచ్చినట్టు వివరించి ఆకట్టుకున్నాడు.
ఐదోళ్లలోపు పిల్లలకు, 60 ఏళ్ల పైన వృద్దులు ఈ వైరస్ బారిన పడుతారని.. స్వైన్ ఫ్లూ వైరస్ అంటు వ్యాధి అని .. వ్యాధి బారిన పడిన వ్యక్తి దగ్గినా తుమ్మినా ఆరు ఆడుగులలోపు ఉన్న వారికి వ్యాధి వ్యాపిస్తుందని వివరంగా విచారించి శబాష్ అనిపించుకున్నారు..
స్వైన్ ఫ్లూ తీవ్రత పెరిగిపోవడంతో కేంద్రం సాయం కోసం మోడీని, కేంద్రమంత్రి వెంకయ్యను సాయం కోరి తెలంగాణ పరిస్థితిని వివరించారు. స్పందించిన కేంద్రం ఒక బృందాన్ని పంపనుంది.