డయల్ 100 ద్వారా 333 ఫిర్యాదుల పరిష్కారం

కరీంనగర్ : శాంతి భద్రతలకు సంబంధించి తలెత్తే సమస్యలపై సత్వరం స్పందన, పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘డయల్ 100’ సేవలకు నవంబర్ నెలలో 3332 అత్యవసర ఫిర్యాదులు అందగా పరిష్కరించామని జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.

దోపిడీ , దొంగతనాలు, తగదాలు రోడ్డు ప్రమాదాలు, హత్యలు, హత్యాయత్నాలు, ఆత్మహత్యలు, తప్పిపోవుట, కిడ్నాప్, అత్యాచారయత్నాలు, గృహహింస , అసాంఘిక కార్యకలాపాలు మొదలగు ఆపదలు సంభవించిన సందర్భంగా ‘డయల్ 100 ’ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.

అలాగే కరీంనగర్ లోని ఉజ్వల పార్క్, డ్యాం , ఇతర శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న 20 మంది యువతీయువకులను శుక్రవారం ‘షీ’ టీం పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించారు. కరీంనగర్ డీఎస్పీ జే రామారావు షీ టీం ప్రేమ్ రాజ్ ఆధ్వర్యంలో కొనసాగిన పెట్రోలింగ్ సందర్భంగా యువతీ యువకులను కౌన్సిలింగ్ నిర్వహించి వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *