
ప్రపంచకప్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దుమ్మురేపిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ మార్టిన్ గప్టిల్ కు ఎడమకాలుకు రెండు వేళ్లు ఉన్నాయన్న సంగతి తెలుసా.. కానీ ఇది నిజం. తన 13 వ ఏట గప్టిల్ తన ఎడమకాలి మూడు వేళ్లను కోల్పోయాడు. ఒక భారీ వాహనం అతని కాలిపై నుంచి వెళ్లడమే ఈ కాలు వేళ్లు కోల్పోవడానికి కారణం. అలాంటి గప్టిల్ క్రికెట్ ఎంతో వేగంగా పరిగెత్తడం నిజంగా అద్భుతమే.. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి ఉన్న గప్టిల్ వేళ్లు లేకున్నా కూడా అద్భుతంగా సాధన చేసి క్రికెట్ లో రాణిస్తున్నారు.