పోస్టు ప్రొడక్షన్‌లో ‘నాన్న.. నేను.. వర్ష..!’

ఆదర్శ్‌బాబు, పావని హీరో హీరోయిన్లుగా ‘శ్రీ ఓం డి ఆర్ట్‌ క్రియేషన్స్‌’ పతాకంపై అజ్మీర్‌ చందు దర్శకత్వంలో ఎఎస్‌ రావు నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నాన్న.. నేను.. వర్ష..!’. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. నవంబర్‌ మొదటివారంలో ఆడియోని, అదే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎఎస్‌ రావు చిత్ర విశేషాలను తెలియజేస్తూ… సినిమా రంగంపై వున్న ఇష్టంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. అన్ని వాణిజ్య హంగులు వున్న యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. నవ్వుకునే వారికి నవ్వుకునేంతగా- కామెడీ, ఫీలయ్యే వారికి ఫీలయ్యేంతగా- లవ్‌, ఆశ్చర్యపడేవారికి ఆశ్చర్యపడేంతగా- యాక్షన్‌, ఆలోచించేవారికి ఆలోచింపచేసేలా- ట్విస్ట్‌లు ఈ సినిమలో వున్నాయి. అలాగే అన్ని వర్గాల సంగీత ప్రియులను అలరించే టీజింగ్‌, ఐటమ్‌, రొమాంటిక్‌, డ్యూయెట్‌, శాడ్‌ సాంగ్స్‌ మరియు లవ్‌ ఫీల్‌ సాంగ్‌లు ఆరు అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి పాటలను సంగీత దర్శకుడు డేవిడ్‌ స్వరకల్పన చేసారు. దర్శకుడు అజ్మీర్‌ చందు చెప్పిన కథ బాగా నచ్చింది. ఎక్కడా రాజీ పడకుండా అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేసాడు. ఇప్పటికే ఆఫ్‌లైన్‌ ఎడిటింగ్‌ చేసినవారు ఈ చిత్రాన్ని చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌, సాగర్‌, వరంగల్‌, రాజమండ్రి తదితర లొకేషన్స్‌లో 30 రోజులు షూటింగ్‌ చేసాము. ఇందులో హీరో ఆదర్శ్‌బాబు 12 గెటప్స్‌లో కనిపిస్తారు. హీరోయిన్‌ పావని నటన చాలా అద్భుతంగా నటించింది. మిగతా నటీనటులు అందరూ బాగా నటించారు. నవంబర్‌ చివరివారంలో గాని, డిసెంబర్‌ మొదటివారంలో గాని ఈ సినిమాలను విడుదల చేస్తామన్నారు.

ఈ చిత్రంలో ఆదర్శ్‌బాబు, పావని, బస్టాప్‌ కోటేశ్వరరావు, చలాకీ చంటి, స్నేహ, హారిక, గంగూభాయ్‌, దిలీప్‌, రాము, శివ, శోభ, శ్రావణ్‌, రఘు, మంగూలాల్‌, సమీర, అక్షయ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు విశ్వత్‌చందు, దాస్‌, ఆదిత్య, లక్ష్మణ్‌, సంగీతం: డేవిడ్‌, కెమెరా: డి.విజయ్‌కుమార్‌, ఎడిటింగ్‌: అనిల్‌రాజు, కో-డైరెక్టర్‌: కె.రాజేందర్‌, సహనిర్మాత: డి.అంజినాయక్‌, నిర్మాత: ఎఎస్‌ రావు, రచన-దర్శకత్వం: అజ్మీర్‌ చందు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *