
ట్విట్టర్ సీఈవోగా ఇన్నాళ్లు బాధ్యతలు వ్యవహరించిన డిక్ కాస్టలో రాజీనామా చేయడంతో ఇప్పుడా పదవికి ఒక తెలుగు వ్యక్తి సీఈవోగా చేపట్టే అవకాశం దక్కింది.. ప్రధాని నుంచి హీరోలదాకా.. సామాన్యలు అనేకమంది ముఖ్యంగా సెలబ్రటీలు ఎక్కువగా ట్విట్టర్ నే వాడుతుంటారు.. అంతటి ప్రపంచ ప్రఖ్యాత ట్విట్టర్ సీఈవోగా తెలుగు మహిళ విజయవాడకు చెందిన పద్మశ్రీ ్ి పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి..
పద్మశ్రీతో పాటు సీవీఎస్ విభాగం అధినేత జిమ్ లాన్ ట్విట్టర్ సీఈవో బరిలో ఉన్నారు. 20 ఏళ్ల క్రితం అమెరికాలో స్థిరపడిన పద్మశ్రీ అక్కడే డిగ్రీలు చేసి వివిధ కంపెనీల్లో సీఈవోలుగా చేశారు. ప్రస్తుతం సిస్కో కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశారు.