
నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యల అభివృద్ధి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ విభాగం ఒక లక్ష రూపాయల చెక్కును గురువారం నాడు స్టేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఐ.పార్దసారధి జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ కు అందజేశారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యల్లో భాగంగా నూతన ట్రాఫిక్ కోన్లు, మాస్క్ లు, టోపీలు, కళ్ళద్దాలు ఇతర రకాల పరికరాలను కొనుగోలు చేస్తామని ఎస్.పి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కలెక్టరేట్ విభాగం మేనేజర్ నర్సింగరావు ప్లానింగ్ అధికారి అపర్ణ, ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ టి.మహేష్ లు పాల్గొన్నారు.