ట్యాబ్ ల వినియోగంపై పోలీసులకు శిక్షణ

00000

కరీంనగర్ : జిల్లాలోని పోలీస్ అధికారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు గాను ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ట్యాబ్ ల వినియోగంపై శిక్షణలో ఆపిల్ ఐడీ, ఫైండ్ మై డివై్, ఐక్లోడ్, టెలిగ్రామ్, రిమోట్ ఫైల్స్ , మైస్కాన్ లతో పాటు వినియోగంలో ఉన్న వివిధ రకాల అప్లికేషన్లపై సాంకేతిక నిపుణులు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డి, డీఎస్పీ కోటేశ్వర రావు, ఇన్ స్పెక్టర్ ఉపేందర్, ఐటీ టీం ఇన్ చార్జి ఎంఎస్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *