
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో నోటీసులు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే తెలంగాణకు చెందిన ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఐపీఎస్, ఒక ఐఏఎస్ కు నోటీసులు జారీ చేేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. దీనిని స్వయంగా తెలంగాణ టీడీపీ కొత్తకోట దయాకర్ రెడ్డి నిన్న మీడియాతో అనడం సంచలనం రేపుతోంది.
ఏపీ సీఎం కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతున్న నేపథ్యంలో ప్రతీగా ఏపీ కూడా ట్యాపింగ్ పై తెలంగాణ అధికారులను, నేతలను ఇరికించే పనిలో నిమగ్నమయ్యింది.