Breaking News

టోల్ గేట్లకు కుప్పలుగా వచ్చిపడుతున్న డబ్బులు

HY06DUDDELA_--__HY_1935889e

పుష్కర పుణ్యం భక్తులకు దక్కుతుందో లేదో తెలియదు.. ఎందుకంటే గోదావరిలో నీళ్లు లేక బురదనీటిలో అక్కడక్కడా స్నానాలు చేయాల్సిన పరిస్థితి.. ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయకపోతే పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉండేది.. కానీ పుష్కరాల సందర్భంగా చాలా మందికి ఉపాధి, పైకం వచ్చిపడుతున్నాయి. పుష్కరాలను పురస్కరించుకొని గోదావరిక్షేత్రాల్లో, తీరంలో దుకాణాలు, ఇతర షాపులు పెట్టుకున్న వారికి భక్తుల కొనుగోలుతో భారీగా డబ్బులొస్తున్నాయి.

కాగా పుష్కరాల సందర్భంగా తెలంగాణలో ప్రధాన రాజీవ్ రహదారి (హైదరాబాద్ టు మంచిర్యాల)పై కాసుల వర్షం కురుస్తుంది. పుష్కరాలకు బస్సులు, కార్లలో, ఇతర వాహనాలలో వస్తున్న వారు లక్షల్లో ఉంటున్నారు. వారు ఖచ్చితంగా రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ల నుండే పోవాలి. దీంతో టోల్ గేట్ల వద్ద కి.మీల కొద్దీ వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. వాహనాలను భారీగా డబ్బు వసూలు కావడంతో టోల్ గేట్లలో డబ్బుల వర్షం కురుస్తోంది. ఈ 12 రోజుల్లో కోట్లలో వసూలు కానుండడంతో టోల్ గేట్ నిర్వాహకులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *