Breaking News

టైటిల్ దేశానికి, తెలంగాణకు అంకితం

sania-mirza-2011-5-26-6-0-49

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఘనస్వాగతం లభించింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు  అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆమెకు ఘనస్వాగతం పలికారు. టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన సానియా మీర్జా తన భాగస్వామి బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి యూఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్న విషయం తెలిసిందే.  శుక్రవారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-సోరెస్ ద్వయం 6-1, 2-6, 11-9తో అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)-శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జంటపై విజయం సాధించింది.డబుల్స్ టైటిల్ సాధించిన  సానియా మీర్జాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అభినందించారు. ఈ విజయం ద్వారా సానియా దేశం గర్వించేలా చేసిందని కొనియాడారు.

తన విజయాన్ని భారత దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, తమ రాష్ట్ర ప్రజానీకానికి అంకితమిస్తున్నానని .  సానియా మీర్జా చెప్పింది. గతంలో తనంతట తాను ఎప్పుడూ విజయాలను ఎవరికో అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించలేదు. కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్య చేసింది. దీనికి కారణం ఆమె  తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలు కావడమేనని అనుకుంటున్నారు.  వింబుల్డన్ మినహా సానియా మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలోనూ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలిచింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *