Breaking News

అల్లం నారాయణకు టైం ఇవ్వని కేసీఆర్

kcr-allam-narayana-1024x630

-జర్నలిస్టుల సమస్యలపై విన్నవించేందుకు వెళ్లిన అల్లం నారాయణకు రేపు కలుద్దాం అని కేసీఆర్ సమాధానం
హైదరాబాద్, ప్రతినిధి : టీయూడబ్ల్యూజేలో పెరుగుతున్న ఒత్తిడి.. జర్నలిస్టుల సమస్యలపై స్పందించడం లేదంటూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే మీద గుర్రుగా ఉన్నారు. మరోవైపు పనిచేయడం లేదంటూ టీయూడబ్ల్యూజే నేతల రాజీనామాలు.. వీటన్నింటితో తీవ్ర ఒత్తిడి సమస్యల పరిష్కారం కోసం బయలు దేరిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు సచివాలయంలో చుక్కెదురైంది. సీఎం కేసీఆర్ కలవడానికి ఇష్టపడలేదు. బీజీగా ఉన్నానంటూ రేపు కలుద్దామని పంపించారట..

ఆంధ్రాలో ఇప్పటికే జర్నలిస్టులకు అక్రిడేషన్, ఇళ్లస్థలాలు.. హెల్త్ కార్డుల పంపిణీ పూర్తయింది.దీంతో తెలంగాణ జర్నలిస్టులు టీయూడబ్ల్యూజేపై ఒత్తిడి తెస్తున్నారు. ఎక్కడ సభ జరిగినా అల్లం నారాయనను నిలదీస్తున్నారు. దీంతో ఆయన బుధవారం సెక్రటేరియట్ లో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లారు. అల్లం నారాయణతో పాటు యూనియన్ కార్యదర్శి క్రాంతి, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ తదితరులు ముందుగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోంమంత్రి నాయినిలను కలిసి జర్నలిస్టుల సమస్యలపై విన్నవించారు. ఆ తర్వాత హోంమంత్రి నాయిని వారిని తీసుకొని సీఎం చాంబర్ వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే సీఎం కేసీఆర్ సమీక్షాసమావేశాల్లో బిజీగా ఉన్నారని అధికారులు చెప్పారు. దీంతో రేపు కలుద్దా అని సీఎం కేసీఆర్ అంటున్నారని నాయిని చెప్పడంతో టీయూడబ్ల్యూజే నేతలు గంట పాటు వెయిట్ చేసి వెనుదిరుగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *