
-విజయవాడలో ఏపీ సీఎం కొత్త క్యాప్ ఆఫీస్ ప్రారంభం
విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు తన కొత్త క్యాంపు ఆఫీసును నూతన రాజధాని ప్రాంతం విజయవాడలో ప్రారంభించారు. ఇకనుంచి విజయవాడ క్యాంపు ఆఫీసులో 3 రోజుల పాటు ఉండి విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. ఉదయం జరిగిన ఈ క్యాంపు ఆఫీసు ప్రారంభోత్సవంలో మంత్రులు, ఎంపీలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
చంద్రబాబు మొదట క్యాంపు ఆఫీసులో పూజలు చేసి అనంతరం ప్రారంభించి కూర్చున్నారు. అనంతరం మంత్రులతో సమావేశమయ్యారు. తెలంగాణ టేపులు బయటపడి పండుగ సరిగా చేసుకోవడం లేదని ధ్వజమెత్తారు. జోష్ చేసుకుందామన్న వార్షికోత్సవ పండుగ టీఆర్ఎస్ చర్యలతో అంతా కళ తప్పిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.