‘టెంపర్’ ట్రైలర్ కు ఫుల్ రెస్పాన్స్

హైదరాబాద్, ప్రతినిధి : టెంపర్ ట్రైలర్ ను బుధవారం ఆడియో విడుదల కార్యక్రమం అనంతరం రిలీజ్ చేశారు. దీంతో రెండు పాటల వీడియోలను రిలీజ్ చేశారు. సినిమా ట్రైలర్ చూస్తే ఈసారి పూరిజగన్నాథ్ చాలా కసితో ఈ సినిమా తీసినట్టు కనిపిస్తోంది. మామూలుగా ప్రతీసారి తన సొంత కథతో వెళ్లే పూరి ఈసారి వక్కంతం వంశీ ఇచ్చిన కథతో ఎన్టీఆర్ తో సినిమాచేశారు. ఎన్టీఆర్ కూడా వంశీ మీద నమ్మకంతో ఈ ప్రాజెక్టును పూరి చేతుల్లో పెట్టారు. నిన్న విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై ఎంతో హైప్ ను సృష్టించారు.

ఇక ఈ సినిమాలో కాజల్ తన అందాలను ఉదారంగా ఆరబోసిందని ఇన్ సైడ్ టాక్.. ట్రైలర్ లో కూడా ఎన్టీఆర్, కాజల్ రోమాన్స్ కుర్రకారును హుషారెత్తించింది. పైన ఏ దుస్తులు వేసుకోకుండా విడుదల చేసిన కాజల్ పోస్టర్ సైతం నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఎన్టీఆర్ డైలాగులు.. ఎక్స్ ప్రెషన్స్ ఈ ట్రైలర్ లో ఎంతో బాగున్నాయి. చూస్తుంటే ఈ సినిమాతో ఎన్టీఆర్, పూరికి విజయాల దాహం తీరేటట్టే ఉంది. బుధవాం విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే యూట్యూబ్ లో  ఒక్కరోజులోనే 2,75,345 మంది చూసి బాగుందని కితాబిచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *