
బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫెస్టివెల్స్ లో ప్రదర్శిస్తున్నారు. దీంతో నిర్మాత శోబు యార్లగడ్డ, దర్శకుడు రాజమౌళీ టూర్ల మీద టూర్లు పోతున్నారు. మొన్న కొరియాకు వెల్లిన రాజమౌళి.. ఇప్పుడు కెనడా టొరెంటోలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ కు వెళుతున్నారు.
కాగా సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు కావాల్సిన బాహుబలి 2 ఇంకా షెడ్యూల్ లో కి రాలేదు.. బాహుబలి గ్రాండ్ హిట్ తో రెండో భాగం పై అంచనాలు పెరిగిపోయాయి.. దీంతో కథను మరింత ఆకర్షణీయంగా మలిచేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే రాజమౌళి ఆయన బృందం కథను ప్రిప్రొడక్షన్ వర్క్ విస్తృతంగా జరుగుతోందట.. మరి రాజమౌళి ఫిలిం ఫెస్టివెల్ లకు తిరుగుతుండడంతో సినిమా కథ, షూటింగ్ జాప్యం జరుగుతోందట.. మరి బాహుబలి 2 2016లో విడుదలవుతుందో లేదో..