
ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమంలో భాగంగా హరియాణా రాష్ట్ర పోటో గ్రాఫర్ ల బృందం రాష్ట్రంలో వారం రోజులు పర్యటించిన ఆనంతరం తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్యదర్శి బుర్ర వేంకటేశం తో బేటి ఆయ్యారు.హరియాణా రాష్ట్ర ప్రభుత్వం సోంత ఖర్చు తో తెలంగాణ లో ఉన్న పర్యాటక ప్రదేశాలు, కోటలు, చారిత్రాత్మక ప్రదేశాలు , సాంస్కృతి సాంప్రదాయలు మరియు ఆర్కియాలజీ ప్రదేశాల తో కూడిన పోటో టేబుల్ బుక్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతి గా ఇవ్వనుంది హరియాణా ప్రభుత్వం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఏక్ భారత్ శ్రేష్ట్ర్ భారత్ కార్యక్రమ ఓప్పందంలో భాగంగా హరియాణా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి పోటో టేబుల్ బుక్ ను ఆందించాలని, తెలంగాణ ప్రభుత్వం హరియాణా రాష్ట్ర ప్రభుత్వానికి పోటో టేబుల్ బుక్ ను బహుమతి గా ఇవ్వనుంది.
ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ లో ప్రభుత్వ ఆనుమతి తో హరియాణా రాష్ట్ర ప్రభుత్వం తరుపున పోటో గ్రాఫర్స్ సోసైటీ ఆప్ చండీగడ్ కు చెందిన పోటో గ్రాఫర్ల బృందం రాష్ట్రంలో రెండు బృందాలగా విడివిడీగా తెలంగాణ ప్రాంతాలను పోటో గ్రాఫర్ల బృందం సుమారు 10 వేల పోటోలు తీసామని త్వరలో పోటో టేబుల్ బుక్ ను తెలంగాణ ప్రభుత్వానికి ఆందిస్తామని పోటో గ్రాఫర్ల బృందం టూరిజం కార్యదర్శి బుర్ర వేంకటేశం కు వివరించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పోటో గ్రాఫర్ల బృందం హరిహణా రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తారని వెల్లడించారు. హరియాణా బృందం రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ , నిజామాబాద్ లలో వున్న పర్యటక ప్రదేశాలను సందర్శించి పోటోలను తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన 10 మంది పోటో గ్రాఫర్ ల బృందం తెలంగాణ లో ఉన్న వారసత్వ కట్టడాలు , కోటలు , పర్యటక ప్రదేశాలు ఆద్బుతంగా ఉన్నయన్నారు. తెలంగాణ టూరిజం వివిధ దేశాలలతో పోటి పడే విధంగా పర్యాటక ప్రదేశాలను ఆభివద్ది చేస్తుందని పోటో గ్రాఫర్ల బృందం మీడియా కు వివరించింది. తెలంగాణ టూరిజం ఆందించిన సహాకారం బాగుందన్నారు.తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్ర వేంకటేశం తో బేటి ఆయిన హరియాణా రాష్ట్రం నుంచి వచ్చిన పోటో గ్రాఫర్స్ సోసైటీ ఆప్ చండీగడ్ కు చెందిన బృందంలో పోటో గ్రాఫర్లు నవనీత్ సక్సేనా, జగత్ జిత్ సింగ్ , విజేంద్ర ట్రిగాటియా లు ఉన్నారు.