Breaking News

టీ హబ్.. గ్రాండ్ ఓపెనింగ్

666

తెలంగాణ ఐటీ ఆవిష్కరణలకు స్వర్గధామంగా మలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కేవలం 17 నెలల్లోనే నిర్మించిన టీ హబ్ కేంద్రాన్ని ఇవాళ సాయంత్రం 5 గంటలకు టాటా మాజీ చైర్మన్ రతన్ టాటా, గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్,  చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ లు ప్రారంభించారు.

అనంతరం కార్యాలయంలోని వసతులు, సౌకర్యాలపై రతన్ టాటా తిరిగి పరిశీలించారు. అమెరికాలో ఉన్న తరహాలో ఇంత అద్భుతంగా నిర్మించిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన వేయినోళ్ల పొగిడారు.

తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ లను ప్రొత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా టీ హబ్ ను చేపట్టిందని టాటా చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రూ.40 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 200 స్టార్టప్ లకు చెందిన 800 మందికి దీనిలో అవకాశం కల్పిస్తారు.  ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, రోబోటిక్స్, మొబైల్ , డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అనే క రంగాల్లో వినూత్న ఉత్పత్తులకు టీహబ్ వేదిక కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *