
ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతాయని.. చేతలు మాత్రం ఉండవని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వడ్యాల్ రాహుల్ పాదయాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తెలంగాణ లో రైతులు అధికసంఖ్యలో చనిపోయారని.. ఇప్పటికైనా రైతులు గురించి ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసిందని.. ఎన్నో పథకాలు, ప్రవేశపెట్టి మేలు చేసిందన్నారు.