Breaking News

టీ.పీఆర్సీతో ఏపీ ఉద్యోగుల్లో గుటగుట

ap-employees-vs-ngos

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ పీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. 43 ఫిట్ మెంట్ సాధించి భారీగా జీతం పొందిన తెలంగాణ ఉద్యోగుల వలే తమకు ఆ ప్రయోజనం దక్కాలని ఏపీ ఉద్యోగులు ఆశిస్తున్నారు. కానీ ఇప్పటికే ఆర్థికలోటుతో.. ఖజానా ఖాళీ అయి కేంద్రం సాయంతో నెట్టుకొస్తున్న ఏపీ ప్రభుత్వం అంతలా పీఆర్సీ పెంచదనే వాస్తవాన్ని ఏపీ ఉద్యోగులు గ్రహించారు. అందుకే తెలంగాణ పీఆర్సీ పెంచినా.. కూడా రాష్ట్ర ఆర్థికపరిస్థితి తెలుసుకొని ఎక్కడా ప్రకటనలు చేయడం లేదు. సీఎం చంద్రబాబును ఈ విషయంలో ఒత్తిడి చేయడం లేదు. దీంతో ఈ విషయంలో చంద్రబాబు ప్రస్తుతానికి సేఫ్ సైడ్ లో ఉన్నారు.

కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా పీఆర్సీ పై చంద్రబాబు ఆరాతీశారని సమాచారం. 43 శాతం ఫిట్ మెంట్ ఆంద్రా ఉద్యోగులకు ఇస్తే ఏటా ఖజానాపై 10వేల కోట్లు భారం పడుతుంది. ఇఫ్పటికే ఆర్థికలోటు కూనరిల్లుతున్న ఏపీ ప్రభుత్వం ఇంత ఖర్చును భరించే స్థితిలో లేదు. కానీ ఉద్యోగులకు పీఆర్సీ పెంచడం తప్పనిసరి కాబట్టి ఎంత పెంచాలి..? ఉద్యోగులను ఎలా సంతృప్తి పరచాలనే దానిపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట.. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రాలో ఎలా ఈ పీఆర్సీని, డబ్బును సమకూర్చాలనే దానిపై, కేంద్రం సాయంపై చంద్రబాబు ఆలోచిస్తున్నారట.. ఏది ఏమైనా తెలంగాణ పీఆర్సీ ఏపీ ఉద్యోగుల్లో ఒకింత ఆందోళన.. తమకు అంత దక్కదన్న నిరాశ నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *