
ఏపీ ప్రభుత్వం కౌంటర్ ఎటాక్ కు దిగింది. ఏపీ సీఎం ముఖ్యమంత్రిపై ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన ఆడియో టేపులను బైటపెట్టి సంచలనం రేపిన టీన్యూస్ కు ఏపీ పోలీసులు తాఖీతులిచ్చారు. విశాఖపట్నం ఏసీపీ రమణ శుక్రవారం అర్ధరాత్రి టీ న్యూస్ చానల్ కు నోటీసులు ఇచ్చారు. కేబుల్ టీవీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 19 ప్రకారం టీన్యూస్ సీఈవో నారాయణ రెడ్డికి ఈ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లో దీనిపై సమాధానం ఇవ్వాలని కోరారు.
ఏపీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా..శతృత్వం పెంచేలా ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిలే కథనం ప్రసారం చేశారని నోటీసులో ప్రశ్నించారు. న్యాయపరంగా దీనిపై చర్య తీసుకుంటామని పేర్కొన్నారు.
ఏపీ పోలీసులు అర్ధరాత్రి తమ కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికమని టీ న్యూస్ మండిపడింది.ప్రెస్ కౌన్సిల్ కు, కేంద్ర సమాచారం శాఖకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. స్థానిక పోలీసులను సంప్రదించకుండా నోటీసులు ఎలా ఇస్తారని పేర్కొంది.