Breaking News

టీ కాంగ్రెస్ లో కరీంనగర్ నేతలదే ఆదిపత్యం..

images

తెలంగాణ పీసీసీలో ఇప్పుడు కరీంనగర్ కాంగ్రెస్ నేతల హవా కొనసాగుతోంది.. ఏ నియామకమైనా సరే కరీంనగర్ నేతలకు ప్రాముఖ్యం లభిస్తోంది. ఇటీవల తెలంగాణ పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా ఆరేపల్లి మోహన్ నియామకంలోనూ కరీంనగర్ నేతల లాబీనే పనిచేసింది. ముఖ్యంగా శ్రీధర్ బాబు, పొన్నం, డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యంజయంలు ఆరేపల్లికి ఎస్సీ సెల్ చైర్మన్ పదవి లభించేలా కీలక పాత్ర పోషించారు..

తెలంగాణ పీసీసీ వివిధ కమిటీ అధ్యక్షుల ఎన్నికల్లో శ్రీధర్ చెప్పినవాళ్లకే పదవులు దక్కుతున్నాయి.. ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే  ఆరేపల్లి మోహన్ కు ఆయన తెలంగాణ పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ పదవి ఇప్పించారు. ఇదే ఆరేపల్లి కి కిరణ్ సర్కారులో విప్ పదవి ఇప్పించి వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత కూడా శ్రీధర్ దే.. అంతేకాదు వేములవాడ దేవస్థానం చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత బొమ్మ వెంకటేశ్వర్లను కూడా శ్రీధర్ బాబే నియమించారు.  ఇక శాసనసభా పక్ష ఉపనేతగా జీవన్ రెడ్డి నియామకంలో కూడా శ్రీధర్ బాబు లాబీయింగ్ పనిచేసింది. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ పీసీసీలో కరీంనగర్ కాంగ్రెస్ నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు.శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎంపీ వివేక్ ఇలా ప్రతి ఒక్కరు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్దదిక్కవుతున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *