టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన శారద

25TV_KPCC_GBS90JDK_1966693e

తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా కరీంనగర్ కు చెందిన కాంగ్రెస్ నాయకురాలు నేరెళ్ల శారద శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మాజీ మంత్రులు అజాద్, వాయిలర్ రవిలు హాజరైన ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కలు నేరెళ్ల శారదకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు.

అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు స్థానం లేదని.. ఆ పార్టీపై ఏడాదిలోనే ఎంతో వ్యతిరేకత వచ్చిందన్నారు. వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం అన్నారు.

అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకుల లలితను సన్మానించారు. ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికవడం ఖాయమని ఆజాద్, వాయిలర్ రవి, ఉత్తమ్ ,భట్టి తెలిపారు.

కార్యక్రమంలో డి.శ్రీనివాస్, జానారెడ్డి, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *