టీ కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ భేటి అయ్యారు. గాంధీ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు, పార్టీ పరిస్థితిపై దిగ్విజయ్ సమీక్షించారు.

అనంతరం దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని.. ఇప్పటివరకు ఒక్క ఎన్నికల్లోనే తాము పోటీచేశామని అందుకే ఈ ఓటమిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో సంస్థాగత మార్పులు చేశామని.. త్వరలోనే నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *