Breaking News

టీ ఉద్యోగులకు జీతాలు పడలేదా..?

protest Telangana job_0

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 1వ తారీఖున జీతాలు పడలేదు.. అందరూ 1వ తేదీన బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లి చూసేసరికి డబ్బులు పడకపోవడంతో హైరానా పడ్డారు. దీనిపై వివరాలు అడిగి తెలుసుకున్నా ఎవరికీ తెలియలేదు. చివరకు ప్రభుత్వమే నిధుల కొరతతో జీతాలు వేయలేదా అని ఉన్నతాధికారులకు ఒత్తిళ్లు వచ్చాయి. కానీ చిన్న సాంకేతిక సమస్యతో జీతాలు చెల్లింపు నిలిచిపోయింది తెలంగాణ ట్రెజరీ అధికారులు తేల్చారు.

ఉద్యోగులకు జీతాలు చెల్లించే ఎస్ బీహెచ్ బ్యాంకులోని ముంబైలో ఏర్పడ్డ సాంకేతిక సమస్య వల్ల తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ , మహబూబ్ నగర్ జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు సాలరీలు పడలేదు. సమస్యను గుర్తించిన అధికారులు బుధవారం సాయంత్రం వరకు దాన్ని క్లియర్ చేశారు. దీంతో గురువారం జీతాలు పడ్డాయి.. ఉద్యోగులు ఊపరి పీల్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వమే నిధులు లేక ఇలా చేసిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *