టీయూడబ్ల్యూజే వేదికపై కళాకారుల ఆటపాట

హైదరాబాద్ : టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రథమ మహాసభ ఘనంగా ప్రారంభమైంది..ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ కామేడ్ర్ షోయబుల్లఖాన్ ప్రాంగణం,లలితకళాతోరణం, నాంపల్లి పబ్లిక్ గార్డెన్ నాంపల్లిలో కళాకారుల ఆట పాటల మధ్య ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు..
దరువు అంజయ్య సాంస్కృతిక బృందం ఆటా పాట అలరించింది. మురళీ మధు పాడిన పాట ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు నగునూరి శేఖర్ వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7000 మందికి పైగా జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ కు తరలివచ్చారు.

మహాసభలో ఆత్మీయ అతిథులుగా ఐజేయూ అధ్యక్షులు ఎస్.ఎన్ సిన్హా , ఐజేయూ జనరల్ సెక్రెటరీ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే. అమర్ నాథ్ పాల్గొన్నారు. ముఖ్య సలహాదారులు కే.శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ సభా నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *