
హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) ప్రచురించిన మీడియా డైరీ-2015ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమగ్ర సమాచారంతో డైరిని తీసుకొచ్చిన యూనియన్ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మాజీ ఎమ్మెల్సీ కే. సత్యనారాయణ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే నేతలు ఏ. రాజేశ్, కె. సుధాకర్ రెడ్డి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.