
-పరకాల టీయూడబ్ల్యూజే సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి
పరకాల, ప్రతినిధి : పాత్రికేయ వృత్తి పరమ ప్రవిత్రమైనదని.. 30 ఏళ్ల నుంచి నాకు జర్నలిస్టులతో మంచి సాన్నిహత్యం ఉందని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని పుష్పాంజలి గార్డెన్ లో టీయూడబ్ల్యూజే యూనియన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరై టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు దేవులపల్లి అమర్ తదితర మిత్రులతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టుల తోడ్పాటు లేనిదే తాను ఇంత ఎత్తుకు ఎదిగే వాడిని కాదని ఆయన అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ది తో కృషి చేస్తానని.. సీఎం కేసీఆర్ ను కలిసి వీలైనంత త్వరగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తెస్తానని పేర్కొన్నారు.
పరకాల ప్రెస్ క్లబ్ లో ఆదివారం శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి టీయూడబ్ల్యూజే రూపొందించిన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన టీయూడబ్ల్యూజే చేస్తున్న సేవలను కొనియాడారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం తరఫున సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
వరంగల్ జిల్లా అధ్యక్షులు శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి , టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, రాష్ట్ర నాయకులు దాసరి కృష్ణరెడ్డి, అయిలు రమేశ్ లు ,నాయకులు నరసింహరాములు, పరకాల ప్రెస్ క్లబ్ అద్యక్షులు జి.జగదీశ్వర్, పాత్రికేయ మిత్రులు సదానందం, సురేందర్, వెంకటేశ్వర శర్మ, మామిడి శరత్, అయిలయ్య, శ్రీనివాసరెడ్డి నాయకులు సంపత్ కుమార్, సిరికొండ భాస్కర్,వీణావాణి, గడ్బం కేశవమూర్తి, సాగర్, జగదీశ్వర్, మధు, తోట సుధాకర్, విద్యాసాగర్, కన్న పరుశరాం, జిల్లా పాత్రికేయులు పాల్గొన్నారు.