టీయూడబ్ల్యూజే (ఐజేయు) లో చేరిన దొంతు రమేష్

 

హైదరాబాద్, ప్రతినిధి : ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొనసాగుతున్న అల్లం నారాయణ నేతృత్వంలోని
టీయూడబ్ల్యూజే లో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న దొంతు రమేశ్ తన
పదవికి రాజీనామా చేసి ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్
కే.శ్రీనివాసరెడ్డిల సమక్షంలో సోమవారంనాడు టీయూడబ్ల్యూజే (ఐజేయు) లో చేరారు.
దొంతురమేశ్ ప్రస్తుతం టీవీ9 వరంగల్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం
నిరంతరం పోరాటం చేస్తున్నటీయూడబ్ల్యూజే (ఐజేయు) లో తిరిగి చేరడం ఆనందంగా ఉందని
దొంతురమేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర అధ్యక్షులు నగునూరి
శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజేయు కార్యవర్గసభ్యులు దాసరి క్రిష్ణారెడ్డి, ఐజేయు
జాతీయ కౌన్సిల్ సభ్యులు అయిలు రమేష్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు సంపత్ కుమార్ తదితరులు
పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *