
ఆస్ట్రేలియా టూర్ టీమిండియా వన్డేల్లో బాగానే ఆడినా అదృష్టం కలిసిరాక 4-1తేడాతో ఓడిపోయింది.. ఆ సిరీస్ కోల్పోయిన జట్టు టీట్వంటీల్లో మాత్రం రెచ్చిపోతోంది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై చిత్తుగా ఓడిస్తోంది. మొదటి టీట్వంటీలో భారత్ 188 పరుగులు చేసి ఆస్ట్రేలియాను ఓడగొట్టగా.. ఈరోజు జరిగిన రెండో టీట్వంటీలోనూ ఆస్ట్రేలియాను అదే రీతిలో ఓడగొట్టింది..
రెండో టీట్వంటీలో అసీస్ పై తొలుగ టాస్ ఓడి బ్యాంటింగ్ చేసిన ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.. రోహిత్ 60, ధావన్ 42, విరాట్ 59 పరుగులు చేశారు.. అనంతరం బ్యాంటింగ్ ప్రారంభించిన అస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులే చేసి ఓడిపోయింది. దీంతో టీ ట్వంటీ సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది.. వన్డే ఓటమికి ప్రతికారం తీర్చుకుంది..