
టీమిండియా క్రికెట్ తాత్కాలిక కోచ్ గా రవిశాస్త్రిని నియమిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే బంగ్లాదేశ్ పర్యటనకు రవిశాస్త్రి కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత జట్టుకు పూర్తిస్థాయి కోచ్ ను బీసీసీఐ నియమించనుంది.
కాగా టీమిండియాకు మంచి కోచ్ ను వెతికే పెట్టే బాధ్యతను బీసీసీఐ ముగ్గురు క్రికెట్ దిగ్గజాలకు అప్పగించింది. సచిన్, గంగూలి, లక్ష్మన్ లను ఇటీవలే బీసీసీఐ సలహాదారులుగా నియమించుకుంది. వచ్చే బంగ్లా టూర్ ముగిసేలోగా కొత్త కోచ్ ను వీరు ఎంపిక చేయనున్నారు.