టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా భట్టి

pcc utham mallu batti

-ఢిల్లీలో ప్రకటన విడుదల చేసిన ఏఐసీసీ
న్యూఢిల్లీ , ప్రతినిధి : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మల్లు భట్టి విక్రమార్క నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. సోమవారం ఢిల్లీలో టీపీసీసీ నేతలు పొన్నాల లక్ష్మయ్య తదితరులు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ని కలిసి రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం ఉత్తమ్, భట్టి నియామకాలను ఖరారు చేస్తూ ప్రకటన విడుదలైంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పొన్నాల విఫలమయ్యారని.. ఆయన హయాంలో కాంగ్రెస్ లో వలసలు అధికమయ్యాయని.. పార్టీని ముందుకెళ్లడంలో విఫలమయ్యారంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో అధిష్టానం నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించింది. రెండు మూడు రోజులుగా ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మోహరించి విస్తృతంగా లాబీయింగ్ గడించారు.

మరో వైపు శాసనసభాపక్ష నాయకుడు జానారెడ్డి కూడా ఢిల్లీలో మకాం వేశారు. ఆయన పదవిని కూడా తీసేస్తారేమోనన్న ఊహాగానాలు ఉన్నాయి. కానీ అధికారికంగా ప్రకటన వెలువడలేదు… ఈ మార్పులతో కాంగ్రెస్ లో కల్లోలం మొదలైంది. పొన్నాల వర్గం అసంతృప్తి రాజ్యమేలుతోంది. వీహెచ్, ఎంపీ గుత్తా వర్గీయులు ఆందోళనలో ఉన్నారు. ముందు ముందు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *