టీపీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి..?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాను త్వరలోనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని కాబోతున్నానని ప్రకటించారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేసీ తనను అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిని చేయబోతోందని చెప్తున్నారాయన.. ఈ మేరకు ఢిల్లీ నుంచి ఉత్తర్వులు వస్తాయని కోమటిరెడ్డి విలేకరులతో చెప్పారు.

కాగా ఆయన సన్నిహితులు, నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు.. తనను పీసీసీ అధ్యక్షుడిగా చేయాలని యాజమాన్యం నిర్నయిందని.. తెలంగాణలో పార్టీని నడిపించడంలో తానే సమర్థుడని అధిష్టానం భావిస్తున్నట్టు నాయకులతో చెప్పారాయన. ఇప్పటికే జిల్లాకు ఉత్తమ్ పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉందని.. వరుస ఎన్నికల్లో ఓటమితో తనను పీసీసీ నూతన అధ్యక్షుడిని చేస్తోందని కోమటిరెడ్డి తన సన్నిహితులతో అంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *