టీపీఎస్సీ చైర్మన్ గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

హైదరాబాద్, ప్రతినిధి : అవినీతి, బంధుప్రీతితో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో భష్టుపట్టిపోయిన ఏపీఎస్సీలో తెలంగాణ నిరుద్యోగులు ఎంతా దగాపడ్డారో ఎన్ని వసూళ్లు జరిగాయో మనందరికీ తెలిసిందే.. దీంతో టీపీఎస్సీలో ఎవరిని నియమిస్తారోనన్న ఉత్కంఠ ఉండేది. కానీ సీఎం కేసీఆర్ మంచి తెలివైన నిర్ణయంతో నిరుద్యోగుల ఆశలకు జీవం పోశారు. తెలంగాణ ఉద్యమకారుడు, విద్యావేత్త, విశ్లేషకుడు అయిన ప్రొపెసర్ ఘంటా చక్రపాణికి టీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించి తెలంగాణ నిరుద్యోగుల ఆశలు నెరవేర్చాడు. చక్రపాణి నియామకంపై తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.

ఇప్పటికే ఉన్నత విద్యామండలిలో… పదవుల భర్తీని యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రభుత్వం… తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై దృష్టి సారించింది. కొత్త రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొలువు తీరింది. టీఎస్ పీఎస్ సి కమిషన్ మొట్టమొదటి ఛైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఛైర్మన్‌ ఎన్నిక ఫైల్‌పై గవర్నర్‌ నరసింహన్‌ సంతకం చేశారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా….
ప్రస్తుతం ఘంటా చక్రపాణి అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా. గతంలో కాకతీయ యూనివర్శిటీలో సోషయాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు. ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో స్వల్పకాలం పాటు న్యూస్‌రీడర్‌గా పనిచేశారు. జర్నలిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఘంటా చక్రపాణి… రాజకీయ విశ్లేషకులుగా అనేక దినపత్రికల్లో, పలు టీవీ ఛానెళ్లలో స్థానం సంపాదించారు.

సభ్యులుగా సి. విఠల్‌కు చోటు…
ఇక టీఎస్ పీఎస్ సి సభ్యులుగా సి. విఠల్‌కు చోటు దక్కింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఉద్యోగ సంఘం అగ్రనేతల్లో విఠల్ ఒకరు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బానోతు చంద్రావతి నియమితులయ్యారు. ఇక మైనార్టీ వర్గానికి చెందిన మతీనుద్దీన్‌ ఖాద్రీలను తెలంగాణ సీఎం ఎంపిక చేశారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఆదిశగా చర్యలు చేపట్టింది. కమిషన్‌కు కార్యదర్శిగా సుందర్ అబ్నర్‌ను నియమించింది. ఆయన శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ప్రత్యేక కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో అబ్నర్‌కు అదనపు బాధ్యతలు ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

2014 ఆగస్టు 8న టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు….
2014 ఆగస్టు 8న టీఎస్‌పీఎస్సీ ఏర్పాటైంది. ఆ వెంటనే కమిషన్ కార్యకలాపాలు ప్రారంభం కావాల్సి ఉన్నా… పాలకమండలి నియామకం, కేంద్రప్రభుత్వ అనుమతుల్లో జాప్యం జరిగింది. అయితే ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు, యువత ఆందోళనల దృష్ట్యా కమిషన్‌ను అమల్లోకి తేవాలని సర్కార్ నిర్ణయించింది. ఆ దిశగానే అడుగులు వేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.