
హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జాతీయ గీతాన్ని అవమానపరిచిన టీడీపీ సభ్యులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీష్ రావు సూచించారు. వారు అందుకు నిరాకరించడంతో వారిపై చర్య తీసుకోవాలని కోరారు. టీడీపీ సభ్యులు క్షేమపణ చెప్పేందుకు నిరాకరించడంతో సభలో దుమారం చెలరేగింది. చివరకు బడ్జెట్ సమావేశాల నుంచి స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.