
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం సహా అన్ని విపక్షాలు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. బడ్జెట్ పై అందరి సలహాలు, సూచనలు పొందాలని టీడీపీ వారు లేకుండా బడ్జెట్ ప్రసంగం పూర్తికాదన్నారు.
దీనిపై హోంమంత్రి స్పందిస్తూ ఇదే గొడవ మహారాష్ట్రలో చేస్తే రెండేళ్లు సస్పెండ్ చేశారని.. కానీ మేం ఈ ఒక్క సమావేశాలకే దూరం పెట్టామని దురుసుగా చెప్పారు. ప్రభుత్వంతో వారు కావాలనే ఇంటా బయట బద్నాం చేస్తున్నారని వారిపై సస్పెన్షన్ ఎత్తివేయలేమని చెప్పారు. మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ జాతీయ గీతాన్ని అవమానించిన వారిని స్పీకర్ ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు.