Breaking News

టీడీపీ, కాంగ్రెస్ లు కలిసి ఎమ్మెల్సీ బరిలోకి.?

22-1440237049-uttam-erraballi-645

స్తానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పుట్టికతోనే బద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్ టీడీపీ పార్టీలు .. అధికార టీఆర్ఎస్ ను ఎలాగైనా ఓడించాలనే ప్రతిపాదనతో తెలంగాణలో ఒక్కటవుతున్నాయి..

తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేస్తే ఓడిపోతామని భావించి ఉన్న రెండు సీట్లనైనా గెలుచుకోవాలనే తలంపుతో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పనిచేయాలని యోచిస్తున్నాయట.. అందులో భాగంగానే సోమవారం టీటీడీపీ నేత ఎర్రబెల్లి .. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ను కలిసి చర్చలు జరిపారు. మహబూబ్ నగర్ లో టీడీపీ, రంగారెడ్డిలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చి పరస్పరం ఒక్కో స్థానంలో గెలుపొందుదామని.. విడిగా పోటీచేస్తే టీఆర్ఎస్ రెండూ గెలుచుకుంటుందని ఎర్రబెల్లి ఉత్తమ్ కుమార్ కు వివరించారట..

కానీ బద్ధశత్రువైన టీడీపీ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారట.. ఒంటరిగానే పోటీచేద్దామని కాంగ్రెస్ స్థానిక నాయకులు చెబుతుండడంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఏం నిర్నయం తీసుకోవాలో పాలుపోవడం లేదట..

కలికాలం కాకపోతే ఏంటి ? టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి తెలంగాణలో పాము ముంగిసలు లాంటి కాంగ్రెస్ టీడీపీలు కలవడం నిజంగా పొలిటికల్ హీట్ ను బాగా పెంచుతోంది.. టీఆర్ఎస్ కు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చినట్టవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *