టీడీపీ, కాంగ్రెస్ లకు గులాబీ ముళ్లు

01F

-ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహానికి పార్టీల బెంబేలు

-5 వ స్థానం కైవసానికి టీఆర్ఎస్ ఎత్తులు

తెలంగాణలో ఎమ్మెల్యేల కేటగిరిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రసవత్తర పోరు నడుస్తోంది. మొత్తం 6 స్థానాలకు 7 నామినేషన్లు దాఖలై కాంగ్రెస్, టీడీపీల్లో గుబులు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ ఒక నామినేషన్ ఎక్కువగా వేయడంతో అది తమ మెడకు చుట్టుకుంటుందని టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు భయపడుతున్నారు.

టీఆర్ఎస్ తరఫున కడియం, తుమ్మల, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, యాదవరెడ్డిలు బరిలో నిలవగా టీడీపీ నుంచి వేం, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల లలిత పోటీకి నామినేషన్ వేశారు. దీంతో దీంతో కాంగ్రెస్, టీడీపీల ఒక సీటుకు టీఆర్ఎస్ టెండర్ వేసినట్టు అయ్యింది. ఏకగ్రీవం కాకుండా టీఆర్ఎస్ వేసిన ఈ ఎత్తుకు ఎవరు బలి అవుతారో ఎన్నికల వరకు తేలనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *