టీడీపీలో పవన్ వ్యాఖ్యల కలకలం..

janasena2

పవన్ కళ్యాణ్ సీమాంధ్ర టీడీపీ ఎంపీలపై చేసిన వ్యాఖ్యలు సీమాంధ్రలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. పవన్ సీమాంధ్ర ఎంపీలు వ్యాపారులు.. రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీనిపై టీడీపీ ఎంపీలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. పవన్ కు ఆర్నెళ్లకోసారి నిద్రలేచి వాగుతాడని.. ప్రజల కోసం ఏనాడైనా రోడ్డెక్కడా.? అని ప్రశ్నించారు..

కాగా వపన్ పై విమర్శలు వద్దంటూ ఏపీ సీఎం చంద్రబాబు జపాన్ నుంచి తన ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు.దీంతో కొంత వరకు విమర్శల వాడి తగ్గినా.. సుజనాచౌదరి, కేశినాని నాని, ఇతర ఎంపీలు మాత్రం పవన్ కుంభకర్ణుడంటూ మండిపడ్డారు. దీంతో ఈ పరస్పర వ్యాఖ్యలు ఇరు పార్టీల నేతల్లో ఉద్రిక్తతకు దారితీశాయి..

ఈరోజు విజయవాడలో టీడీపీ ఎంపీలు పవన్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పవన్ లేకపోతే టీడీపీ ఏపీలో గెలిచేదే కాదు అంటూ మండిపడ్డారు. టీడీపీ , జనసేన వైరంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *