Breaking News

టీడీపీలోకి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్.?

Mukesh-Goud

హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణలో దాదాపు తుడిచిపెట్టుకుపోతున్న టీడీపీ మళ్లీ వలసలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ సిటీలో మళ్లీ పట్టు సాధించడానికి టీడీపీ రెడీ అయింది. ఆపరేషన్ ఆకర్స్ తో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ని లాగాలని ప్లాన్ చేస్తోంది. సనత్ నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే టీడీపీలో జాయిన్ కావడానికి ముఖేష్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ లో చేరడంతో ఉప ఎన్నిక జరగడం ఖాయం . ఇక్కడ ఉప ఎన్నికలు ఖాయం కావడంతో పాటు టీడీపీ క్యాడర్ బలంగా ఉండడంతో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడినట్టు సమాచారం. ముఖేష్ ఎంట్రీకి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖేష్ గౌడ్ టీడీపీలో చేరితే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం కలిగే అవకాశం ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *